Yehona na kapari neevenayya యెహోవా నా కాపరి నీవేనయ్యా

Song no:
    యెహోవా నా కాపరి నీవేనయ్యా
    యెహోవా నా ఊపిరి నీవేనయ్యా

    నా గానము నా ధ్యానము
    నా గమ్యము నీవయ్యా
    నా స్నేహము నా సర్వము
    సమస్తము నీవే యేసయ్యా || యెహోవా నా కాపరి ||

  1. అనుదినము నీ సన్నిధిలో
    స్తుతియించి పాడెదను
    తంబురతో సితారాలతో
    ఆరాధిస్తూ ఘనపరచదన్ } 2
    శోధనలు ఎదురొచ్చినా
    వేదనలు వెంటాడినా
    బంధువులే వేదించినా
    స్నేహితులే శోధించినా
    నిను విడువనయ్యా మరువనయ్యా
    కడవరకు నీవేనయ్యా || యెహోవా నా కాపరి ||

  2. అనుక్షణము నీ వాక్యముతో
    నిను వెంబడించెదను
    సంతోషముతో నీ సువార్తకై
    కరపత్రిక వలే మారెదన్ } 2
    లోకమే భయపెట్టినా
    మనుష్యులే నను చుట్టినా
    శక్తులే నను కూల్చినా
    మరణమునకు చేర్చినా
    నే బెదరనయ్యా జడవనయ్యా
    కడవరకు నీవేనయ్యా || యెహోవా నా కాపరి ||


Post a Comment

కొత్తది పాతది