Song no:
HD
- దేవా నా మొర వినవా - నా ప్రార్థన ఆలకించవా . . . } 2
- గాలికి ఊగేరెల్లె నా మనసు
నెమ్మది లేక కదులుచున్నది } 2
చేసిన దోషములు నన్ను తరుమగను
వేదనతో హృదయం అదురుచున్నది } 2
క్షమియించువాడ నాయేసురాజ
ఈ ఘోరపాపిని క్షమియించుమా } 2 || దేవా ||
- గతించిపోయే లోకపు నటనలు
స్థిరమని నమ్మి మోసపోతిని } 2
గమ్యం తెలియని జీవిత యాత్రలో
గతియేమవ్వునో ఎరుగనైతిని } 2
నడిపించువాడ నా యేసురాజ
నీ చేతితో నన్ను దరిజేర్చుమా } 2 || దేవా ||
నాపాపము నన్ను తరుమగా - నా ప్రాణము తల్లడిల్లగా .
నీ చెంతకు చేరినానయ్యా - నీ శరణే కోరినానయ్యా || దేవా ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి