Song no:
HD
- నిత్యమైన మహిమను వీడి - కోట్ల దూత గణములనొదిలి
- దీనులకు రక్షణ వస్త్రము - కప్పు రక్షకుడు
మరణ ఛాయ నుండి - గొప్ప వెలుగుకు నడిపే మన నాయకుడు } 2
మహా సంతోషకరమైన - సువర్తమానమును
దూతలచేత పంపెను - పొలములోని గొల్లలకు } 2
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్
హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||
- తూర్పు దేశ జ్ఞానులను సహితము - పిలిచినవాడు
రాజరికపు పాలనకై రాజులను - సిద్ధపరిచే మన రారాజు } 2
అత్యానందభరితమైన - క్షణములను చూచుటకు
నక్షత్రముచే నడిపెను - యూదయ దేశపు రాజుయొద్దకు } 2
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్
హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||
- నశించినవారిని సహితము - వెదకి పిలుచుటకు
దివి నుండి భువికి తండ్రి చేత పంపబడెనే - మన రక్షకుడు } 2
ఎందరో పాపులను క్షమియించి - పాపుల స్నేహితుడాయెను
జక్కయ్యలో మార్పు - ఆ దినమే ఆరంభమాయెను } 2
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్
హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||
నీతిని స్థాపించుటకు - దివి నుండి భువికి వచ్చెను } 2
భువి నడిబొడ్డున - బేత్లెహేము పురి గడ్డపై
క్రీస్తు యేసను నరునిగా - మన రాజు జన్మించెను } 2
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ - మెర్రి మెర్రి క్రిస్మస్
హ్యాపీ మెర్రి క్రిస్మస్ - హ్యాపీ మెర్రి క్రిస్మస్ || నిత్యమైన ||