Song no: 51
- చూస్తున్నాడమ్మా చెల్లీ చూస్తున్నాడమ్మా
- చీకట్లో చేశానని - నన్నెవరు చూస్తారని
చూసినా నాకేమని - ఎవరేమి చేస్తారని } 2
భయమసలే లేకున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? } 2 || చూస్తున్నాడమ్మా ||
- విదేశాల్లో ఉన్నానని - చాలా తెలివైనదాన్నని
అధికారాలున్నాయని - ఏం చేసినా చెల్లుతుందని } 2
విర్రవీగుతున్నావా? చెడ్డ పనులు చేస్తున్నావా? } 2 || చూస్తున్నాడమ్మా ||
- సువార్తను విన్నా గాని - నాకు మాత్రం కానే కాదని
ఇప్పుడే తొందరేమని - ఎపుడైనా చూడొచ్చులే అని } 2
వాయిదాలు వేస్తున్నావా చెడ్డ పమలు చేస్తున్నావా? } 2 || చూస్తున్నాడమ్మా ||
నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా
అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా
తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా } 2