Song no:
- అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2
- కన్నీరు తడిచి కలతలను బాపే
కలుషాత్ములను కడిగే కరుణాత్ముడవు నీవే }2
కృపా సత్య సంపూర్ణమై నా హృధిని గెలిచావే }2
కొనియాడ నా యేసయ్య కోటి కంటాలతో
కీర్తించే నా యేసయ్య స్తోత్ర గీతాలతో
ఎందుకింత ప్రేమయ్య నా పైన యేసయ్య }2
అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే
- వేదనలు తొలగించి శోధనలు గెలిపించి
వారసునిగా మార్చి వీరునిగా చేసావే }2
వాక్యంతో నను నింపి వారధిగా నిలిపావే }2
విలువైన పిలుపుతో పిలిచి వెన్నంటే ఉన్నావే }2
ఎంత వింత ప్రేమయ్య నా పైన యేసయ్య }2
అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2
ప్రేమను పంచగలిగినా పరమ తండ్రివి నీవె
సహయం చెయగలిగిన నా హితుడవు నీవే }2
నీ ప్రేమ చాలయ్య నను కొన్న యేసయ్య
నీ ప్రేమ చాలయ్య నను కన్న యేసయ్య
అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2