నే పాడనా ... నీ
ప్రేమ గీతం
నన్నెంతగానో
ప్రేమించిన నీ దివ్య
చరితం
నీ పాద ధూళినై
.... సంకీర్తనా స్వరమునై
నే పాడనా ... నీ
ప్రేమ గీతం
యేసయా - నా
యేసయా - సర్వము
నీవేనయ ఈ దాసురాలికి
1. ఆపదలో ఉన్ననన్ను
ఆప్తుడై ఆదుకుంటివి - నీ
ప్రేమను నే రుచి
చూసితినీ
నశించవలసిన
నన్ను వెదకీ రక్షించితివీ - నీ
క్రుపను నే పొందుకుంటినీ
నా కన్నీటి బొట్టు నేల
జారక మునుపే - చిరునవ్వై
నాట్యమాడుచున్నదీ
మహిమ, ఘనత
నీకే - నా
యేసు దేవా
2. ఘోర
సిలువను నాకై ధరియించితివి -
నిత్య ప్రేమతో నన్ను జయించితివీ
నీ అరచేతిలో
నన్ను దాచుకుంటివి - నిత్య
రక్షణలో నను నడిపించితివీ
నేను సైతము నీ ఆత్మ
జ్వాలలో - నీ సేవకై నే
తపియించితినీ
మహిమ, ఘనత
నీకే - నా
యేసు దేవా