Chikattlu tholegenu yesuni rakatho చీకట్లు తొలగెను యేసుని రాకతో-హోసన్నా

చీకట్లు తొలగెను యేసుని రాకతో-హోసన్నా హోసన్నా
వెలుగు కలిగెను యేసుని జన్మతో-హోసన్నా హోసన్నా
భువిలో శాంతి నెలకొల్పుటకు - శాంతి రూపుడేసయ్యా
ఇలలో వెలసినాడయ్యా (2)
శాంతి కాంతి ఆ యేసే - జీవనజ్యోతి ఆ యేసే
జీవజలము ఆ యేసే - జీవాహారము ఆ యేసే
హృదయాలను వెలిగించుటకు-సదయుడైన దేవుడు
వెలసే పశుల శాలలో-బాలయేసుగా ..చీకట్లు
ఆశ్చర్యకరుడు ఆ యేసే - ఆలోచనాకర్త ఆ యేసే
నిత్యుడగు తండ్రి ఆ యేసే-సమాధానకర్త ఆ యేసే
హృదయాలను వెలిగించుటకు-సదయుడైన దేవుడు
నరుల కొరకు నరుడాయే నజరేయుడు ..చీకట్లు
Blogger ఆధారితం.