Song no:
కావలెనా యేసయ్య భహుమానము}
చేయాలి విలువైన ఉపవాసము }॥2॥
మరి సిద్దమవు శ్రీయేసుని ప్రియసంఘమా}
చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మలా }॥2॥
॥కావలెనా॥
1॰
నినివే పట్టణము
యెహోవా దృష్టికి ఘోరమాయెను
పాపముతో నిండిపోయెను
సృష్టికర్త యెహోవా యోనాను దర్శించి
నినివే పంపెను
కనికరము చూపించెను
ఘనులేమి అల్పులేమి
నీనెవె దేశపు రాజేమి
పిల్లలేమి పెద్దలేమి ఉపవాసముచేయగా
ఆగింది యెహోవా శాపము }
కురిసింది కరుణావర్షము }॥2॥
॥కావలెనా॥
2॰
దేవుని ప్రజలను నశియింపజేయుటకు
దుష్టుడు తలంచెను
కలవరము పుట్టించెను
మోర్దుకై వేదనతో
రాజునొద్దకు పంపుట దైవచిత్తమని
ఎస్తేరును సిద్ధపరచెను
ఘనులేమి అల్పులేమి
షూషను కోటలో రాణియేమి
పిల్లలేమి పెద్దలేమి ఉపవాసముచేయగా
అణిగింది హామాను గర్వము }
జరిగింది దేవుని చిత్తము }॥2॥
॥కావలెనా॥