నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్

నీ స్వరము వినిపించు ప్రభువా

పల్లవి:    నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్

నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో               .. నీ..

1.        ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము

దినమంతటి కొరకు నను సిద్దపరచు రక్షించు ఆపదల నుండి           .. నీ..

2.        నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు

నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు               .. నీ..

3.        భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము

అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను              .. నీ..

4.        నాతో మాట్లాడు స్పస్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే

నీతో మనుష్యులతో సరిజేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా           .. నీ..

Post a Comment

కొత్తది పాతది