Nee chethitho nannu pattuko lyrics

నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను - అనుక్షణము నన్ను చెక్కుము
1. అంధ కారా లోయలోన సంచరించిన భయములేదు
నీ వాక్యం శక్తి గలది - నాత్రోవకు నిత్య వెలుగు (2)
2. ఘోర పాపిని నేను తండ్రి - పాప ఊబిలో పడియుంటిని
లేవ నెత్తుము శుద్ది చేయుము పొందనిమ్ము నీదు
ప్రేమను (2)
3. ఈ భువిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను - జీవితాంతం నీ సేవచేసెదన్

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.