- నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా
- దీపముగా నీ వాక్యాన్నిచ్చి
తిన్నని త్రోవలో నన్ను నడిపి
నాకు ముందుగా నీవే నడచి
జారిపడకుండా కాపాడితివి
కొండ తేనెతో నన్ను తృప్తి పరచి
అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి
ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి } 2 ||నాకన్ని||
- ఆత్మ శక్తితో నన్ను అభిషేకించి
అంధకార శక్తులపై విజయాన్నిచ్చి
ఆశ్చర్య కార్యములెన్నో చేసి
శత్రువుల యెదుట భోజనమిచ్చి
ఎక్కలేని కొండలు ఎక్కించితివి
నా గిన్నె నిండి పార్ల చేసియితివి
నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి } 2 ||నాకన్ని||
నీ నీడలో దాచుకుంటివి నను దేవా } 2
నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను
నీవు చేసిన మేల్లను తలచుచునే ఇల జీవించెదను
నాకన్ని నేవే దేవా
నా బ్రతుకు నీకే ప్రభువా } 2