Nannethagano preminchenu lyrics

నన్నెంతగానో ప్రేమించెను
పల్లవి:     నన్నెంతగానో ప్రేమించెను  - నన్నెంతగానో కరుణించెను
 నా యేసుడు - నా పాపము - నా శాపము
తొలగించెను - నన్ను కరుణించెను          (2X) .. నన్నెంతగానో..
1.  సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో      (2X)
పడనీయక - నన్ను చెడనీయక                       (2X)
తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను  (2X) .. నన్నెంతగానో..
2.   సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము     (2X)
 నేర్పించెను - నాకు చూపించెను                       (2X)
  వర్ణించగాలేను ఆ ప్రభువును                          (2X)  .. నన్నెంతగానో..
3. కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును         (2X)
నా కోసమే -  తాను శ్రమ పొందెను                    (2X)
నా పాపమంతటిని క్షమియిం చెను                   (2X)   .. నన్నెంతగానో..
4.    ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు        (2X)
ఏమిచ్చెదన్ -  నేనేమిచ్చెదన్                        (2X)
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును                (2X)   .. నన్నెంతగానో..
Copyright © Lyrics List. Designed by OddThemes