Stuthi yagamu nayesunike lyrics స్తుతి యాగము నా యేసుక

స్తుతి యాగము నా యేసుకే
పల్లవి:
స్తుతి యాగము నా యేసుకే - అర్పించెదను - ఎల్లప్పుడు
1.
నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి - ప్రతి నిముషము నా
మార్గములొ
నన్ను నడిపిన కృపను తలంచి - స్తుతులర్పించెదను -
నీకె
...స్తుతి...
2.
ఓదార్పు లేనట్టి చీకటి వేళలో - ఆదరణ కర్తవు నాకు నీవు
మారా అనుభవం మార్చి ఇలలొ - సంతసమిచ్చితివి - నిత్య
...స్తుతి...
3.
రక్షక నీవే నా శైలము బలమును - యుద్ధ దినములో నాకేడము
సాతాను అస్త్రములు ఆర్పివేసి - జయము నొసగితివి - గోప్ప
...స్తుతి...
4.
దేవుని సెలవు లేనిది ఏదయు - జరుగదుగా అని గ్రహించితిని
నా జీవితములో ప్రతి దినమును - మేలుకొరకే గదా కల్గెను
...స్తుతి...
5.
ఆర్భటించు సీయోన్ హర్షించు - షాలేమా నీ యేసు నీతోనె
యుండెనుగా
ఆయన మనకు ఆదియు అంతము - పాడెద హల్లెలూయ ఆమేన్
...స్తుతి...

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.