Dhevuni yandhu nirikshna numchi

దేవుని యందు - నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు - నా ప్రాణమా
1. ఏ పాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడు వాడు
ప్రతిక్షణం - నీపక్షముండు రక్షకుడు "దేవుని"
2. చీకటిని వెలుగుగ చేసి - ఆయన నీ ముందు పోవువాడు
సత్యమగు జీవమగు - మార్గము యేసే "దేవుని"
3. నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొను వాడు ఆయనే
ఆధారము - ఆధరణ ఆయనలో "దేవుని"
4. తల్లి తన బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను
తల్లి కన్న తండ్రికన్న ఉత్తముడు "దేవుని"
5. నీకు విరోధముగా నిరూపించిన - ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు
శత్రువులు మిత్రులుగా మారుదురు "దేవుని"
6. పర్వతములు తొలగి పోయినను - తన కృప నిన్ను ఎన్నడు వీడదు
కనికర సంపన్నుడు - నీ దేవుడు "దేవుని"
7. స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ "దేవుని"

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.