Dhevude na kasrayambbu

దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము= మహా
వినోదుడాపదల సహాయుడై నన్ బ్రోచును
అభయ - మభయ - మభయ మెప్పు - డానంద –
మానంద - మానంద మౌగ ||దేవుడే||
1. పర్వతములు కదలిన నీ - యుర్వి మారు పడినను =
సర్వమును ఘోషించుచు నీ - సంద్రముప్పొంగినన్ -
అభయ - మభయ - మభయ మెప్పు- డానంద ||దేవుడే||
2. దేవుడెపుడు తోడు కాగ - దేశము వర్దిల్లును =
ఆ తావునందు ప్రజలు మిగుల - ధ న్యులై వసింతురు –
అభయ - మభయ - మభయ మెప్పు - డానంద ||దేవుడే||
3. రాజ్యముల్ కంపించిన భూ- రాష్ట్రముల్ ఘోషించిన =
పూజ్యుండౌ యెహోవా వైరి - బూని సంహరించును –
అభయ - మభయ - మభయ మెప్పు - డానంద ||దేవుడే||

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.