Dhevudu manaku yellappudu thoduga nunnadu

దేవుడు మనకు ఎల్లప్పుడు - తోడుగ నున్నాడు - 2
1. ఏదెనులో ఆదాముతోనుండెన్ -హానోకుతోడ నేగేను
ధీర్గదర్శకులతో నుండెను - ధన్యులు దేవుని గలవారు "తోడుగ"
2. దైవాజ్ఞను శిరసావాహించి - దివ్యముగ నబ్రాహము
కన్న కుమరుని ఖండించుటకు - ఖడ్గమునెత్తిన యపుడు "తోడుగ"
3. యేసేపు ద్వేషించబడి నపుడు - గోతిలో త్రోయ బడినపుడు
శోధనలో చెరసాలయందు - సింహాసన మెక్కిన యపుడు "తోడుగ"
4. ఫరోరాజు తరిమిన యపుడు - ఎర్రసముద్రపు తీరమున
యోర్దాను నది దాటినపుడు - ఎరికో కూలినా యపుడు "తోడుగ"
5. దావీదు సింహము నెదిరించినపుడు - దైర్యముగ, చీల్చీనపుడు
గొల్యాతును హతమార్చినపుడు - సౌలుచే తరమ బడినపుడు "తోడుగ"
6. సింహపు బోనులో దానియేలు - షడ్రకు,మేషకు, అబెద్నెగో
అగ్ని గుండములో వేయబడెన్ - నల్గురుగా కనబడినపుడు "తోడుగ'
7. పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు
అపొస్తులులు విశ్వాసులు - హింసించాబడిన యపుడు "తోడుగ"

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.