దేవుడంటే నీకిష్టమా ఏ కష్టానికైన సిద్ధమా

దేవుడంటే నీకిష్టమా - ఏ కష్టానికైన సిద్ధమా - 2
అవసరానికే దైవమా అనుభవించుటే న్యాయమా
నీ సుఖమే ముఖ్యమా తన త్యాగమే వ్యర్ధమా
నీ బ్రతుకే నీ ఇష్టమా - 2 దేవునికే సంతాపమా "దేవుడంటే"
1. హానోకు భూమిపై దేవునితో నడచెను
దేవునికే యిష్టుడై - దేవుడతనిని తీసుకెళ్ళెను
నువ్వు దేవునికిష్టుడవైతే నిను కూడా తీసుకెళ్ళును
తన దూతలనే పంపి లాజరువలె తీసుకెళ్ళును
దేవునిలో కష్టపడి - రక్షించుటకిష్టపడి
దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి
ఆదేవుని పని చేసేవారతనికి కావాలి
వారే తనకిష్టం - తన ఇష్టం ఎవరికి ఇష్టం
2. నశియించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు
తన వారిని రక్షించుట కొరకు నలగాలి ప్రతి రోజు
క్రీస్తునే నమ్ముటకాక శ్రమపడుటే నేర్చుకోవాలి
నిను చూచిన ఆదేవుడే దూతలతో పొంగిపోవాలి
ఒక్క పాపి మారితే ఒకరిని నీవు మార్చితే
అంతకన్న ఆదేవునికింకేమి కావాలి
ఆదేవుని పనిలో మరణిస్తే నినుచూడాలి
వారే తనకిష్టం - తన ఇష్టం ఎవరికి ఇష్టం

Post a Comment

కొత్తది పాతది