A. P. : Aatankamu leka Yesu nangikarinchi chateda melladalan
1. Aayana raakada bahu sameepamani vaakyamu vraasiyunnadi
vanchakula dushtakaryamulappudu - bahiranga parachabadun || Idiye ||
2. Mathai iruvadi naalugava adyaayamu Marku badamoodunu
luka eruvadiyokata vadyayamu - chuda mugimpu theliyun || Idiye ||
3. Yuddamulu bhuvi jaruguchu nunnavi - daivachittamu jarugun
maranamula sankya hechchu chunnadi - nagarulu vanikedunu || Idiye ||
4. Devudu raagaa naakamu marunu - bhoomi dahanamagunu
neellu samudramu linkipovu - yesu thirigi raagan || Idiye ||
5. Visvasulandaru nilchuta nijamu - devudesuni vaakyamu
velaleni rakshana kalgu saampadyamu - samsayulaku ledu || Idiye ||
6. Kaalamu vyardhamu cheyaku dharalo - karmamu pattukonaku
paapamun prematho pattiyunchaku shaapamu kougalimpaku || Idiye ||
7. Halleluya padi yellaraku thelupa - nellarato koodanu
twaragaa raabovu Yesunu sandhimpa - aayaththa padumu vega || Idiye ||
పల్లవి : ఇదియే అనుకూల సమయము నీకు - ఘన రక్షణ దినము
అనుపల్లవి : ఆటంకము లేక యేసు నంగీకరించి - చాటెద మెల్లడలన్
1. ఆయన రాకడ బహు సమీపమని - వాక్యము వ్రాసియున్నది
వంచకుల దుష్టకార్యములప్పుడు - బహిరంగ పరచబడున్ || ఇదియే ||
2. మత్తయి యిరువది నాలుగవ అధ్యాయము మార్కు పదమూడును
లూకా యిరువదియొకట వధ్యాయము - చూడ ముగింపు తెలియున్ || ఇదియే ||
3. యుద్ధములు భువి జరుగుచు నున్నవి - దైవచిత్తము జరుగున్
మరణముల సంఖ్య హెచ్చుచున్నది - నగరులు వణికెడును || ఇదియే ||
4. దేవుడు రాగా నాకము మారును - భూమి దహనమగును
నీళ్ళు సముద్రము లింకిపోవు - యేసు తిరిగి రాగన్ || ఇదియే ||
5. విశ్వాసులందరు నిల్చుట నిజము - దేవుడేసుని వాక్యము
వెలలేని రక్షణ కల్గు సంపాద్యము - సంశయులకు లేదు || ఇదియే ||
6. కాలము వ్యర్థము చేయకు ధరలో - కర్మముపట్టుకొనకు
పాపమున్ ప్రేమతో పట్టియుంచకు - శాపము కౌగిలింపకు || ఇదియే ||
7. హల్లెలూయా పాడియెల్లరకు తెలుప - నెల్లరతో కూడను
త్వరగా రాబోవు యేసును సంధింప - ఆయత్త పడుము వేగ || ఇదియే ||