నీతోడు నాకుండగా ఒంటరిని కానెన్నడూ
ఒంటరిని కానెన్నడూ|2|
నా యేసయ్యా , ఒంటరిని కానెన్నడూ,
ఈ లోకమే నాకు ఒక విష వలయం
నా జీవితమే నీకు నిలయం|2|
పరలోకమే నీవు వేసిన వలగా|2|
నను చేపట్టిన నా యేసయ్యా|2| || నీతోడు నాకుండగా ||
కన్నీటి లోయలో లేయాను చూసి
కన్నీరు తుడిచిన కనికర దేవా|2|
నా దుఃఖ దినమున
ఆనందమొసగిన|2|
నన్నాదరించిన నా యేసయ్యా|2| || నీతోడు నాకుండగా ||
యోసేపునకు తోడైయున్నావు
గిద్యోనుకు నీవు తోడైయున్నావు|2|
మోషేకు నీవు తోడైయున్నావు|2|
నాతోడు నీవే నా యేసయ్యా|2| || నీతోడు నాకుండగా ||
కామెంట్‌లు లేవు: