కానుక తెచ్చాను అర్పించగ దేవా

    కానుక తెచ్చాను అర్పించగ దేవా [2]
    ప్రేమతో స్వీకరించు నాదైవమా [2] || కానుక తెచ్చాను ||

  1. పువ్వులు తేవాలని తోటకు వెళ్ళాను
    విరివిగా ఉన్నాయి విరసిన కూసుమాలు [2]
    కమ్మని సువాసనల తెమ్మెద మధురిమలు [2]
    నీగుడిలో ఉండాలని అడిగి అడిగి వచ్చాయి [2] || కానుక తెచ్చాను ||

  2. ఫలములు తెద్దామని తోటలు వేధికాను
    చెట్లమీద ఉన్న పండ్లు చేర్చు ప్రభుని అన్నాయి [2]
    మంచి మంచి ఫలములు మధురమైన ఫలములు [2]
    ఏరికోరి తెచ్చాను నీకె అర్పించాలని [2] || కానుక తెచ్చాను ||

  3. శ్రమలతో పండించిన ఫలములే తప్పా
    నీరునము తీర్చగా ఏమివ్వగలను [2]
    నిర్మల మనస్సును నితిగల ప్రేమను [2]
    నీకొరకే అర్పించేద స్వీకరించు దేవా [2] || కానుక తెచ్చాను ||

Post a Comment

కొత్తది పాతది