505
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- పరిశుద్ధమయిన యా యెరుషలేము పురము వర పద్మరాగంపు స్ధిర పునాదులతోడ పరిఢవిల్లు సువర్ణ ప్రహరియు గోడలు నురురత్న ద్వారంబు లదిరిగ గల వహహ ||పరిశుద్ధం||
- ఆ నీతిపురమున నాకాశమున వెల్గు భానుండు శశి కాన బడ బోవు దేదీప్య మానంబై విలసిల్లు మానిత గొఱ్ఱియ దానికి జ్యోతియై తనరుచుండు నహహ ||పరిశుద్ధం||
- శృంగారమైనట్టి బంగారు వీధులలో చెంగు చెంగున దాటు శ్రేష్ట సమయంబున మంగళ ప్రదమైన మహిమ రాజ్యమునందు రంగైన ప్రభుయేసు రాజున్ దర్శింతును ||పరిశుద్ధం||
- తళతళ మెఱసెడు ధవళంపు టంగీలు కళ లీనుచుండంగ గాళ్లార ధరియించి భళిర భళిర యంచు భక్తాళితో నెపుడు నెళవుగా నుందుము నిజ రక్షకుని చెంత ||పరిశుద్ధం||
- భూరి వీణెలు చేత బొల్పుగ ధరియించి సారెకు మీటుచు సంగీత ములు బాడి శ్రీ రాజా నీకు జో హారంచు ప్రభు యేసు పేర గీర్తింతురు ప్రియ భక్తులందఱు ||పరిశుద్ధం||
- కరములు జోడించి శిరముల్ క్రిందికి వంచి వరపీటమును జుట్టి తిరుగు దూతలగూడి పరిశుద్ధం పరిశుద్ధమని నేను పరమ సంగీతంబు బాడుచుండెద నాహా ||పరిశుద్ధం||
కామెంట్‌ను పోస్ట్ చేయండి