Nee krupa nanu veedanannadhi nee krupa నీ కృప నను వీడనన్నది నీ కృప ఎడబాయనన్నది

Song no:
HD
    నీ కృప నను వీడనన్నది
    నీ కృప ఎడబాయనన్నది } 2
    పర్వతములు తొలగినను మెట్టెలు దద్ధరిల్లినను
    సముద్రము ఘోషించిన లోకమంతా లయమైనను
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది

  1. క్రుంగియున్న సమయాన అలసిసొలసిన తరుణనా
    విరిగినలిగిన స్థితిలోనా విఫలమైన నా బ్రతుకులోనా } 2
    ఎవరికోసమో పరుగిడితిని ఎవరి ప్రేమనో పొందనైతిని } 2
    నాదరికి చేరిన నీ కృప నన్నాదరించిన నీ కృప
    నను నడిపించిన నీ కృప ( నను స్థిరపరచిన నీ కృప } 2 )
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది || నీ కృప నను ||

  2. పాపమేలిన నా హృదిలోన శాపినైనా నా జీవితాన
    మాలిననమైన నా మదిలోనా శాంతిలేని నా బ్రతుకున } 2
    లోకమే నాకు శాశ్వతమని లోకాశాలలో మునిగిపోతిని } 2
    నను ఎరుగ వచ్చిన నీ కృప నను రక్షించిన నీ కృప
    నను చేరదీసిన నీ కృప ( నను లేవనెత్తిన నీ కృప } 2 )
    యేసయ్య నీ కృప నను వీడనన్నది
    యేసయ్య కృప ఎడబాయనన్నది || నీ కృప నను ||




Post a Comment

కొత్తది పాతది