Ammanu minchina preme needhayya అమ్మను మించిన ప్రేమే నీదయ్యా

Song no:
    అమ్మను మించిన ప్రేమే నీదయ్యా
    నిను వర్ణించగా నే సరిపోనయ్య
    పాపికి శరణమా ప్రేమకు రూపమా
    అక్కున చేర్చిన ఆశ్రయా దుర్గమా

  1. మంటితో నన్ను మలచినావు
    నీదు పోలికలో చేసినావు
    ఏదేనులో నను ఉంచావు
    ఆదామని నను పిలచినావు
    తినవద్దన్నది నే తింటిని
    పాపము అన్నదే నే కంటిని
    ఎందుకో ఇంత జాలి చూపావు

  2. మాటవినక పాపినైతిన్
    ఆ తోట నుండి త్రోయబడితిన్
    నీ మధుర సహవాసం కోల్పోయినాను
    నిను చేరలేనని నే తలచినను
    యేసు అను యాగమే చేసావే
    నిన్ను చేరు మార్గమే చేసావే
    ప్రేమతో నీ దరి చేర్చావే
    || ||


Post a Comment

కొత్తది పాతది