sarva srustiki karthavu neeve yesayya సర్వసృష్టికి కర్తవు నీవే యేసయ్యా

Song no:
HD
    సర్వసృష్టికి కర్తవు నీవే యేసయ్యా
    సర్వ జనులకు దేవుడవు నీవే నయా  || 2 ||
    ఆదియు అంతము నీవే దేవా
    ఆసాద్యమైనది నీకేమి లేదు              || 2 ||

    అ.పల్లవి : యెహోవా నిస్సీ నాజయము నీవే
    యెహోవా షాలోం నా శాంతి నీవే         || 2 ||

  1. నీ రెక్కల క్రింద ఆశ్రయమిచ్చి
    అపాయ మేదియు రాదని చెప్పితివే      || 2 ||
    మహోన్నతుడా నీనీడలో నాకు
    సుఖసంతోషములు పంచిన యేసయ్యా   || 2 || యెహోవా ||

  2. విడువక నాయెడ కృప చూపించి
    నా మనవులన్నియు సఫలము చేసితివే    || 2 ||
    ఆశ్చర్యకరుడా! ఆత్మ సారధివై
    విజయపదములో నడుపుచున్న యేసయ్యా  || 2 || యెహోవా ||

  3. నీ మహిమ నాపై ఉదయింప జేసి
    రాజ మకుటముగా నను మలచితివే        || 2 ||
    నా ప్రాణ నాధుడా! నా చేయి విడువక
    మహిమైశ్వర్యముతో దీవించిన యేసయ్యా   || 2 || యెహోవా ||

Post a Comment

أحدث أقدم