Song no:
HD
- సర్వసృష్టికి కర్తవు నీవే యేసయ్యా
- నీ రెక్కల క్రింద ఆశ్రయమిచ్చి
అపాయ మేదియు రాదని చెప్పితివే || 2 ||
మహోన్నతుడా నీనీడలో నాకు
సుఖసంతోషములు పంచిన యేసయ్యా || 2 || యెహోవా ||
- విడువక నాయెడ కృప చూపించి
నా మనవులన్నియు సఫలము చేసితివే || 2 ||
ఆశ్చర్యకరుడా! ఆత్మ సారధివై
విజయపదములో నడుపుచున్న యేసయ్యా || 2 || యెహోవా ||
- నీ మహిమ నాపై ఉదయింప జేసి
రాజ మకుటముగా నను మలచితివే || 2 ||
నా ప్రాణ నాధుడా! నా చేయి విడువక
మహిమైశ్వర్యముతో దీవించిన యేసయ్యా || 2 || యెహోవా ||
సర్వ జనులకు దేవుడవు నీవే నయా || 2 ||
ఆదియు అంతము నీవే దేవా
ఆసాద్యమైనది నీకేమి లేదు || 2 ||
అ.పల్లవి : యెహోవా నిస్సీ నాజయము నీవే
యెహోవా షాలోం నా శాంతి నీవే || 2 ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి