Song no:
no audio HD
- నీవే కృపాధారము త్రియేక దేవా - నీ వేక్షేమాధారము నా యేసయ్యా
- ఆనందించితి అనురాగబంధాన - ఆశ్రయపురమైన నీలో నేను -2
ఆకర్షించితివి ఆకాశముకంటే ఉన్నతమైన నీ ప్రమనుచూపి - 2
ఆపదలెన్నో అలుముకున్ననూ అభయమునిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలిచితివి
ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||
- ప్రార్థించితిని ప్రాకారములను - దాటించగలిగిన ప్రభువే నీవని -2
పరిశుద్ధతకై నియమించితివి - నీరూపమునాలో కనపరచుటకు 2
పావనమైన జీవనయాత్రలో విజమునిచ్చితివి
పరమరాజ్యములో చేర్చుటకొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||
- సంపూర్ణతకై సంతృప్తి కలిగి - సిలువను మోయుచు నీతో నడిచెద - 2
సుడివడిననా బ్రతుకును మార్చితివి - సింహాసనముకై నను పిలచితివి - 2
శిధిలముకాని సంపదలెన్నో నాకైదాచితివి
సాహసమైనమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
సర్వశక్తిగల దేవుడవైనాముందు నడచిన
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా - ఈ స్తోత్రగీతం నీకేనయ్యా || నీవే ||
నూతన బలమును నవనూతన కృపను - 2
నేటివరకు దయచేయుచున్నావు
నుపల్లవి :- నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్రగీతం నీకేనయ్యా