الصفحة الرئيسيةAKK📖 Yehova na kapari le memi galugadhu యెహోవా నా కాపరి లే మేమి గలుగదు byOnline Lyrics List —نوفمبر 15, 2019 0 15 రాగం - (చాయ: ) తాళం - యెహోవా నా కాపరి లే మేమి గలుగదు తన మహా కృపతోఁ బ్రోచి నన్ను మనుపు నాతఁడే||పచ్చికగల చోట్ల నను పరుండజేయుచుఁ గడు హెచ్చగు సౌఖ్యములు సదా యిచ్చు నాతఁడే||శాంతికర జలములకు నను సాగజేయుచు విశ్రాంతి ప్రాణమున కొసంగు విభుఁడు అతఁడే||గాఢాంధకారమైన లోయల గుండ బోయిన నే కీడుకు భయపడ నిఁక నా తోడు ఆయనే||దుడ్డుకఱ్ఱతో శత్రువులఁ దరుమఁగొట్టుచుఁ దన దొడ్డ దండముతో నీతి దారిలో నడుపు||అందరిలో నన్ను నెంచి యధిక ప్రేమతోఁ గడు విందు లొసఁగి తృప్తిపరుచు విభుఁడు ఆయనే||ముఖము కళగా నుండునట్లు మంచితైలమున్ నా సఖుఁడు నాకుఁ బూయుచుండు సకల వేళలన్||బ్రదుకు దినము లన్నిట నాకు బంటులవలెనే నను వెదకి కృపా క్షేమములు నా వెంటవచ్చును|| update || Update ||