Song no:
- ఆత్మ నింపుమా జీవాత్మ నింపుమా
- కలుష దోష భారములే బ్రతుకు క్రుంగ దీసినవి
వ్యాధి బాధలేకములై కేదమాయెను – ఘన దైవమా… ఆఆ…..
నీ దాపు చేర్చి ప్రాపు చూపుమా
అనుదినము నీదు ఆశ్రయాన సేద తీర్చుమా || ఆత్మ నింపుమా ||
- అహము ఇహము పాశములై వ్యధల పాలు చేసినవి
ఒడలు పాప పొడల చేత యేహ్యమాయెను – కరుణాత్మ శ్రీ… ఆఆ…..
ఈ కరుణ మెంచి శరణమీయుమా
తృణమైన బ్రతుకు తూలిపోక జాలిచూపుమా || ఆత్మ నింపుమా ||
పరమ పావనాత్మ నీదు వరములీయుమా
ఆత్మ నింపుమా..
إرسال تعليق