Nee krupa leni kshanamuna yemoudhuno నీ కృప లేని క్షణమున ఏమౌదునో

Song no:

    నీ కృప లేని క్షణమున ఏమౌదునో
    నీ కృప విడిన క్షణమున ఏమౌదునో
    ఏమౌదునో ఊహించలేనయ్య
    నేనేమౌదునో తెలియదయ్య.

  1. రక్షణ నావలో నేనుండగ
    బాధలు పేనుగాలులై తాకినా
    మరణపు భయములు అవరించిన
    శ్రమలు సుడిగుండాలై నన్నుచుట్టిన
    నీ ప్రేమ చూపితివి నన్ను బలపరచితివి
    నీ కరములుచాపితివి నన్ను లేవనెత్తితివి
    నీ నిత్య కృపలో నన్ను దాచితివి..ఇ..ఇ. || నీ కృప ||

  2. సాతాను సింహం వలె గర్జించిన
    హృదయమును గాయపరచి  కృంగదిసిన
    ఇహలోక మనుషులె నిందించిన
    ఆత్మీయులె నాకు దూరమైన
    నీ ప్రేమ చూపితివి నన్ను ఆదరించితివి
    నీ కరములుచాపితివి నన్ను స్వస్థపరచితివి
    నీ దివ్య కృపలో నన్ను దాచితివి...ఇ..ఇ... || నీ కృప ||
أحدث أقدم