Madhuramainadhi na yesu prema marapuranidhi మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది

Song no:

    మధురమైనది నా యేసు ప్రేమా
    మరపురానిది నా తండ్రీ ప్రేమ.... } 2
    మరువలేనిదీ నా యేసు ప్రేమా } 2
    మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
    ప్రేమా... ప్రేమ... ప్రేమా... నా యేసుప్రేమ } 2 || మధురమైనది ||

  1. ఇహ లోక ఆశలతో అంధురాలనైతిని
    నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని } 2
    చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి } 2
    నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం
    ప్రేమా... ప్రేమ... ప్రేమా... నా యేసుప్రేమ } 2 || మధురమైనది ||

  2. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
    మార్గమును చూపి మన్నించితివి } 2
    మరణపు ముల్లును విరచిన దైవా } 2
    జీవమునోసగిన నీ ప్రేమ మధురం
    ప్రేమా... ప్రేమ... ప్రేమా... నా యేసుప్రేమ } 2 || మధురమైనది ||
أحدث أقدم