పంక్తిలోకి రండి - క్రిస్మసు పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి రండి || పంక్తి ||

  1. ఎరుకపరుపలెండి - క్రిస్మసు - నెరుకపరుపలెండి క్రిస్మసు
    నెరుక పరుపలెండి = వెరువకుడి శుభ - వార్త యిదియం
    దర కానంద - కరమైనది మీ కొరకై రక్షకుండు - బుట్టెనని
    ఎరిగించిన గబ్రి - యేలు దూత || పంక్తి ||

  2. మహిమ పరుప రండి - దేవుని మహిమ పరుప రండి దేవుని
    మహిమపరుపరండి = మహికిన్ దేవ కు - మారుడు వచ్చిన
    మహిమకార్య స-న్మానార్ధంబై - మహిమ సంభవ - మగు దేవునికిని
    మహిమగ పలికిన - మహిమ దూతల || పంక్తి ||

  3. దేవప్రియులగుడి - క్రిస్మస్ దేవప్రియులగుడి - క్రిస్మస్
    దేవప్రియులగుడి = దేవుని కిష్టులౌ వారలకు
    ఈ వసుధను లభి - యించును శాంతి
    ఈ విధముగా వచి - యించిన బుధజన
    సేవకాళియగు - దేవదూతల || పంక్తి ||

  4. మనసున జూడండి - బాలుని - మనసునజూడండి - బాలుని
    మనసున జూడండి = జనన వార్తను వినిన వెంటనే
    మనసున భీతి - యణగిన వారై
    మనసా నంద - బును గలవారై
    చని శిశువును చూ-చిన గొల్లల || పంక్తి ||

  5. చేకొనుడి వార్త - భద్రము - చేసికొనుడి వార్త - భద్రము
    చేసికొనుడివార్త = ఆ కాపరుల - యన్నిమాటలు
    స్వీకరించి మది - చింతనచేయుచు
    శ్రీ కరజన్మవి - శేషంబులు హృది
    చేకొని భద్రము - చేసిన యామె || పంక్తి ||

  6. వింతగా చూడండి శిశువును - వింతగా చూడండి =
    అంత దేవుడు నరుడై వచ్చిన - వింతశిశువును - జూచుచు
    మదిని - సంతస మొందుచు - నిశ్శబ్దముగ
    చెంతను గూర్చుండిన - యోసేపు || పంక్తి ||

  7. ఆరాధించండి - క్రీస్తును ఆరాధించండి - క్రీస్తును
    ఆరాధించండి = రారాజగుని-శ్రాయేల్ రాజౌ
    ఈ రాజున్న - యింటికి చుక్క
    దారిచూపగా - జేరి మ్రొక్కుచు
    ఆరాధించిన - తూరుపుజ్ఞానుల || పంక్తి ||

  8. మనకని నమ్మండి - క్రిస్మసు - మనకని నమ్మండి - క్రిస్మసు
    మనకని నమ్మండి = మనకై క్రీస్తు - మహిలో బుట్టెను
    గనుక కృతజ్ఞత - గనపరచుటకై
    మనసున బాహ్యమున - క్రిస్మసు
    పనులు పూనుకొను - వారి సమాజ || పంక్తి ||





raagaM: navarOju taaLaM: aadi



    paMktilOki raMDi - krismasu paMktilOki raMDi
    krismasu paMktilOki raMDi || paMkti ||

  1. erukaparupaleMDi - krismasu - nerukaparupaleMDi krismasu
    neruka parupaleMDi = veruvakuDi Subha - vaarta yidiyaM
    dara kaanaMda - karamainadi mee korakai rakshakuMDu - buTTenani
    erigiMchina gabri - yaelu doota || paMkti ||

  2. mahima parupa raMDi - daevuni mahima parupa raMDi daevuni
    mahimaparuparaMDi = mahikin^ daeva ku - maaruDu vachchina
    mahimakaarya sa-nmaanaardhaMbai - mahima saMbhava - magu daevunikini
    mahimaga palikina - mahima dootala || paMkti ||

  3. daevapriyulaguDi - krismas^ daevapriyulaguDi - krismas^
    daevapriyulaguDi = daevuni kishTulau vaaralaku
    ee vasudhanu labhi - yiMchunu SaaMti
    ee vidhamugaa vachi - yiMchina budhajana
    saevakaaLiyagu - daevadootala || paMkti ||

  4. manasuna jooDaMDi - baaluni - manasunajooDaMDi - baaluni
    manasuna jooDaMDi = janana vaartanu vinina veMTanae
    manasuna bheeti - yaNagina vaarai
    manasaa naMda - bunu galavaarai
    chani SiSuvunu choo-china gollala || paMkti ||

  5. chaekonuDi vaarta - bhadramu - chaesikonuDi vaarta - bhadramu
    chaesikonuDivaarta = aa kaaparula - yannimaaTalu
    sveekariMchi madi - chiMtanachaeyuchu
    Sree karajanmavi - SaeshaMbulu hRdi
    chaekoni bhadramu - chaesina yaame || paMkti ||

  6. viMtagaa chooDaMDi SiSuvunu - viMtagaa chooDaMDi =
    aMta daevuDu naruDai vachchina - viMtaSiSuvunu - joochuchu
    madini - saMtasa moMduchu - niSSabdamuga
    cheMtanu goorchuMDina - yOsaepu || paMkti ||

  7. aaraadhiMchaMDi - kreestunu aaraadhiMchaMDi - kreestunu
    aaraadhiMchaMDi = raaraajaguni-Sraayael^ raajau
    ee raajunna - yiMTiki chukka
    daarichoopagaa - jaeri mrokkuchu
    aaraadhiMchina - toorupuj~naanula || paMkti ||

  8. manakani nammaMDi - krismasu - manakani nammaMDi - krismasu
    manakani nammaMDi = manakai kreestu - mahilO buTTenu
    ganuka kRtaj~nata - ganaparachuTakai
    manasuna baahyamuna - krismasu
    panulu poonukonu - vaari samaaja || paMkti ||