Kreesthu chenthaku rammu priyuda yesu chenthaku rammu క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా

Song no: 354

    క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా
    యేసు చెంతకు రమ్ము ప్రియుడా
    జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్

  1. ఆయనే జీవజలము - నిత్యమైన తృప్తినిచ్చును
    నీవు ఆ జలము త్రాగిన - ఇంకెన్నడు దప్పిగొనవు
    యుగ యుగములవరకు || క్రీస్తు ||

  2. ఆయనే జీవాహారము - నిత్యమైన తృప్తినిచ్చును
    జీవాహారము భుజించిన - ఆకలిగొనవెప్పుడు
    యుగ యుగములవరకు || క్రీస్తు ||

  3. ఆయనే జీవ మార్గము - స్వర్గరాజ్యమును చేరను
    ఆయన నంగీకరించిన - తండ్రియొద్దకు చేరెదవు
    యుగములు రాజ్య మేలను || క్రీస్తు ||

  4. ఆయనే యేకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను
    నీ వందు ప్రవేశించిన - చేరుదువు నిశ్చయముగ
    నిత్యసుఖము లొందెదవు || క్రీస్తు ||

  5. ఆయనే నిత్య సత్యము - సర్వలోకమును రక్షింప
    ఆయనను స్వీకరించిన - నిత్య శిక్షనుండి తప్పించున్
    సదా ఆయనతో నుందువు || క్రీస్తు ||
أحدث أقدم