Kasta nastalaina kadagandla brathukaina కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా

Song no:

    కష్ట నష్టాలైనా కడగండ్ల బ్రతుకైనా
    ఈ జీవి నీ తోడు ఎడబాసి పోదులే (2)

    నిను ఎడబాసినపుడు – నా బ్రతుకే దండగా
    బ్రతికున్న మూన్నాళ్ళ – నీతోనే పండుగా
    యేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట||

    కొండగా అండగా – నీవుండగ లోకాన
    ఎండిన ఎముకలయినా – ఉండగా జీవంగా
    యేసయ్య మార్గమే నడువర ఓరన్న ||కష్ట||

    కారు మబ్బు కమ్మినా – కాలమెదురు తిరిగినా
    నీ సిలువ నెత్తుకొని – నే సాగిపోతాను ||కష్ట||
أحدث أقدم