Song no:
- నీకన్నా- ఎవరు ఉన్నారయ్యా లోకంలో
- పాపమందు నేను - పడిపోయి ఉన్న వేళ
లేవనెత్తినవు - కృప చూపినావు దేవా (2)
నా పాపము తొలగుటకొరకై రక్తం కార్చితివి
నన్ను శుద్ధిని చేయుట కొరకై సిలువ సహించితివి (2) || నా తల్లి నీవేనయ్యా ||
- ఆకలైన వేళ - ఆహారమిచ్చినావు
దాహమైన వేళ - జీవజలములిచ్చినావు (2)
నా శాపము తొలగించుటకై సమాధి చేరితివి
నన్ను మహిమకు మార్చుటకొరకై మరణం గెలిచితివి (2) || నా తల్లి నీవేనయ్యా ||
- వ్యాది యందు నేను - పడి కృంగియున్నవేళ
పరము నుండి నాకై - దిగి వచ్చినావు దేవా (2)
నీ గాయములందు ఉన్న స్వస్థత నిచ్చితివి
నీ రెక్కల క్రింద నన్ను నిత్యము దాచితివి (2) || నా తల్లి నీవేనయ్యా ||
నాకన్నీ నీవే నా - యేసయ్య (2)
నా తల్లి నీవేనయ్యా - నా తండ్రి నీవేనయ్యా (2)
మంచి స్నేహితుడైన నీవే - యేసయ్యా
నిజ బంధువుడైన నీవే - యేసయ్యా (2) || నీకన్నా ||