సిద్ధపడుదాం సిద్ధపడుదాం }
మన దేవుని సన్నిధికై }
సిద్ధపరుచుదాం సిద్ధపరుచుదాం }॥2॥
మన హృదయము ప్రభు కొరకై }
సిద్ధమనస్సను జోడు తొడిగి }
సమాధాన సువార్త చాటెదం }॥2॥
సమాధాన సువార్త చాటెదం ......
॥సిద్ధపడుదాం॥
హల్లెలూయ ....॥4॥
హోసన్నా.... హోసన్నా....
హల్లెలూయ.... హోసన్నా
ప్రతి ఉదయమున ప్రార్ధనతో }
నీ సన్నిధికి సిద్ధమవుదును }
జీవము కలిగిన వాక్కులకై }॥2॥
నీ సన్నిధిలో వేచియుందును }
॥సిద్ధమనస్సను॥ ॥సిద్ధపడుదాం॥
సత్కార్యముకై సిద్ధపడి }
పరిశుద్ధతతోనుందును }
అన్నివేళలయందు ప్రభుయేసుని }॥2॥
ఘనపరచి కీర్తింతును }
॥సిద్ధమనస్సను॥ ॥సిద్ధపడుదాం॥
బుద్ధిని కలిగి నీ రాకడకై }
మెలకువతో నేనుందును }
నీ రాజ్య సువార్తను ప్రకటించి }॥2॥
ప్రతివారిని సిద్ధపరతును }
॥సిద్ధమనస్సను॥ ॥సిద్ధపడుదాం॥
కామెంట్‌ను పోస్ట్ చేయండి