Song no: #54
- నా యేసూ, ఆత్మ సూర్యుఁడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ.
- నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పనిచేయఁగా నా యొద్ద నుండు రక్షకా.
- నాతోడ రాత్రింబగళ్లు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింపఁ జావఁజాలను.
- నేఁడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపఱచి నీ మందలోకిఁ జేర్చుము.
- రోగిని స్వస్థపఱచి బీదలను పోషించుమీ దుఃఖించువారి దుఃఖముఁ బాపి యానంద మియ్యుము.
إرسال تعليق