Peenugu unna chota graddhala gumppulamta పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట

పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట
అందులు చూపు బాట గుంటకు చేర్చునంట
మోసపోయేవాడు ఉన్నంత కాలం
మోసాగించేవాడికి పంచభక్ష్య పరమాన్నం
పడిపోయేవాడు ఉన్నంత కాలం
పడద్రోసేవాడికి నిత్యకళ్యాణం పచ్చతోరణం *పీనుగు**

గొర్రెచర్మం కప్పుకున్న తోడేళ్ళ గుంపులవెంట
మోసపోయి సాగుతున్న జ్ఞానంలేని మనుష్యులంట
చెట్టుమంచిదైతే దాని ఫలము కూడా మంచిదేగా ....
ముండ్లపొదలలోన  మీకు ద్రాక్షపండ్లు  దొరకవుగా
కడవరి దినములలో సాతాను అనుచరుల మోసాలు అధికము...

విశ్వాస భ్రష్టత్వం అవకాశం
ఎవరిని మింగుదునాయని తిరుగుతు ఉన్నది గర్జించుసింహం
పరలోక ప్రవేశం సత్ క్రియల వలనే సాధ్యం...
ఆత్మను రక్షించే శక్తికలిగినది దేవుని వాక్యం
   /పీనుగు/

సత్యవిషయమైన ప్రేమ అవలంబించని సంఘమంట
అబద్దాలనాశ్రయించి దుష్టుని బలమునకు లొంగేనంట
ఆక్రమము చేయువారికి ప్రభువుయొద్ద చోటుందా
దైవద్రోహనేరానికి క్షమాపణ లభిస్తుందా?
ప్రభువా ప్రభువా అని ఎంత పిలిచినా ఉపయోగం ఉంటుందా?

మోసాన్ని నమ్మడమే పతనానికి తొలిమెట్టు
అసత్య భోదకులకు అదేకదా ఆయువుపట్టు
భోధను మార్చడమే అబద్దికుల కనికట్టు...
నీ బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని కనిపెట్టు
      ||పీనుగు||

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.