llపllనీవే నీవే నా సర్వం నీవే సమస్తము నీవే
నీవే నీవే నా జీవం నీవేే సహాయము నీవేll2ll
నీ స్నేహము కోరి ఎదురు చూస్తున్నాll2ll
ఎదురు చూస్తున్నా యేసయ్యా
ఎదురు చూస్తున్నా
llనీవే నీవేll
llచllఅనుక్షణము నిన్ను చూడనిదే
క్షణమైనా వెడలనులే
హృదయములో నీ కోసమే
నిన్ను గూర్చిన ధ్యానమేll2ll
అణు వణువునా ఎటు చూచినా
నీ రూపం మది నిండెనే
నీ రూపం కోరెనే
llనీవే నీవేll
llచllఒంటరి నైనా నీ స్పర్శ (స్వరము) లేనిదే
బ్రతుకే లేదని
అనుదినము నీ ఆత్మలో
నిన్ను చూసే ఆనందమేll2ll
అణు వణువునా ఎటు చూచినా
నీ రూపం మది నిండెనే
నీ రూపం కోరెనే
llనీవే నీవేll
إرسال تعليق