Song no: #51
- దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁ కమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా ||దినము||
- సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువా దొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము ||దినము||
- కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెం గట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు ||దినము||
- తలఁపువలనను నోటి పలుకువలనను జెనఁటి పనులవల్ల మేము వలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి ||దినము||
- ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద నీ దినమ్ము మాకు సామర్ధ్యమొసఁగితివి వంద నమ్ము దేవ ||దినము||
- ఈ దినము మాకు సమ్మోదంబుతో నిచ్చి యాదుకొన్న వరమౌ నీ దివ్యదానముల కై దేవ! మా కృతజ్ఞతను గొమ్ము ||దినము||
- అలసిన మా దేహములకు వలసిన నిదురఁ గలుగఁజేసి నీదూ తల హస్తములలో మమ్ములను దాఁచుము భద్రముగను దేవ ||దినము||
- అరుణోదయముననిన్నర్చించు కొఱకు నీ కరము సాఁచి మమ్ము త్వరగా మేల్కొల్పుము స్వాస్థ్య ప్రదాతవై పరమదేవ ||దినము||
- దాత వీవె లోక త్రాత వీవె మాకు నేత వీవె యేసు నీతి సూర్యుండవి ఖ్యాతి మహిమలు నీకె కలుగుఁగాక ||దినము||
إرسال تعليق