ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీచిత్తమే ప్రభువా


ఎన్ని తలచినా ఏది అడిగినా   }
జరిగేది నీచిత్తమే                    }॥2॥ ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని   }
నా ప్రార్థనఆలకించుమా     }॥2॥ ప్రభువా
             1॰
నీ తోడు లేక నీ ప్రేమ లేక        }
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు }॥2॥
అడవి పూవులే నీ ప్రేమ పొందగా ॥2॥
నా ప్రార్థన ఆలకించుమా ॥2॥ ప్రభువా      ॥ఎన్ని॥
              2॰
నా ఇంటి దీపం నీవే అని తెలసి          }
నా హృదయం నీ కొరకై పదిలపరచితి }॥2॥
ఆరిపోయిన నా వెలుగు దీపము ॥2॥
వెలిగించుము నీ ప్రేమతో ॥2॥ ప్రభువా      ॥ఎన్ని॥
              3॰
ఆపదలు నన్ను వెన్నంటియున్నా  }
నా కాపరి నీవై నన్నాదుకొంటివి     }॥2॥
లోకమంతయూ నన్ను విడచినా ॥2॥
నీ నుండి వేరు చెయ్యవు ॥2॥ ప్రభువా      ॥ఎన్ని॥
             4॰
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి }
నా కొరకై కల్వరిలో యాగమైతివి     }॥2॥
నీదు యాగమే నా మోక్ష మార్గము ॥2॥
నీయందే నిత్యజీవము ॥2॥ ప్రభువా         ॥ఎన్ని॥