నా సఖుడా - ప్రియ యేసయ్య
నా హితుడా - స్నేహితుడా
నీవెంత గొప్ప వాడివయా - నను ఆదరించినావయ
1. సింహాల
బోనులో నా ప్రాణానికి
ప్రాణమైన - నా విభుడవు
చెరసాలలో నా సంకెళ్ళు
విరచి విడుదలనిచ్చిన - రక్షకా
కన్నతల్లి
కూడా నన్నెరుగక మునుపే నన్నెరిగిన - నా తండ్రివీ
॥ నా సఖుడా
||
2. గొల్యాతైన,
ఏ యుద్ధమైన విజయమునిచ్చిన - వీరుడవూ
పది వేల మంది
నావైపు కూలినా నాతో నిలచిన
- ధీరుడవూ
నా దోషములను నీదు రక్తముతో
తుడిచివేసిన - పరిశుద్ధుడవూ
॥ నా సఖుడా
||
3. ఏ ఎన్నిక
లేని నను ప్రేమించిన
- కృపామయుడవూ
అందరూ విడిచినా నన్నెన్నడు విడువని
- కరుణామయుడవూ
నిస్సారమైన
నా జీవితములో సారము పోసిన - సజీవుడవూ
॥ నా సఖుడా
||