నను బ్రోవ రావయ్యా .... కంటిపాపలా నను కాన రావయ్యా ... (2)
యేసయ్యా... యేసయ్యా...
యేసయ్యా...యేసయ్యా...
నను బ్రోవ రావయ్యా... నను కాన రావయ్యా (2)
ఆ లోయలో ... క్రమ్మిన చీకటిలో
ఈ ఇలలో .... నిరాశల వెల్లువలో (2)
1. దహించివేస్తున్న అవమానము - కరువైపోయిన సమాధానము (2)
పగిలిన హృదయము - కన్నీటి ధారల సంద్రము (2)
ఎగసి పడుతున్న కెరటము - కానరాని గమ్యము (2)
2. ఏకమైన ఈ లోకము - వేధిస్తున్న విరోధము
దూరమౌతున్న బంధము - తాళలేను ఈ నరకము (2)
ఈదలేని ప్రవాహము - చేరువైన అగాధము (4)