అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో

Andaala Thaara Arudenche Naakai Ambara Veedhilo
Avathaaramurthy Yesayya Keerthi Avani Chaatuchun
Aanandasandra Mupponge Naalo Amarakaanthilo
Aadi Devuni Jooda – Aashimpa Manasu Payanamaithini || Andaala Thaara ||

Vishwaasa Yaathra Dooramenthaina Vindugaa Dochenu
Vinthaina Shaanthi Varshinche Naalo Vijayapathamuna
Vishwaala Neledi Deva Kumaaruni Veekshinchu Deekshatho
Virajimme Balamu – Pravahinche Prema Vishraanthi Nosaguchun || Andaala Thaara ||

Yerushalemu Raajanagarilo Yesuni Vedakuchu
Erigina Daari Tholagina Vela Yedalo Krungithi
Yesayya Thaara Yeppativole Yeduraaye Throvalo
Entho Yabbura Paduchu – Vismaya Monduchu Yegithi Swaami Kadaku || Andaala Thaara ||

Prabhu Janma Sthalamu Paakaye Gaani Paraloka Soudhame
Baaluni Jooda Jeevithamantha Paavanamaayenu
Prabhu Paadha Pooja Deevena Kaaga Prasarinche Punyamu
Brathuke Mandiramaaye – Arpanale Sirulaaye Phaliyinche Praarthana || Andaala Thaara ||

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని || అందాల తార ||

విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ || అందాల తార ||

యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి
యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు || అందాల తార ||

ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన. || అందాల తార ||