త్వరగా వస్తాడుయేసయ్యా తరుణం నీకిక లేదయ్యా

    త్వరగా వస్తాడుయేసయ్యా
    తరుణం నీకిక లేదయ్యా
    కృపాకాలం దాటిపోతే...
    కఠిన శ్రమలే ఎదురౌను
    రేపు అన్నది నీదికాదు
    రక్షణ నొందుము నేడేనీవూ
    రక్షనొందుము నేడేనీవూ
    రక్షనొందుము నేడేనీవూ

కరుణ మూర్తియై వచ్చెన్
           మొదటి సా..రీ..
మహోగ్రుడై వచ్చున్
                 రెండవసా..రీ..
యూదాగోత్రపు సింహమై
తీర్పుచేయ దిగి వచ్చున్
రాజులూ రణధీరులు
              భూప్రజలందరూ..
భయపడి వణికెదరూ...
తాళగలవా తీర్పునూ..
        ఓర్చగలవా ఉగ్రతనూ
తాళగలవా తీర్పునూ
సృష్టిలయమై పోవునూ
         ఉగ్రతదినమందూ..
భూమి దద్దరిల్లుచూ
                స్థానముతప్పగా
అయ్యోఅయ్యో శ్రమ
                         యనుచూ
గుండె బాదుచు ఏడ్చినా
దొరకదు నీ కాశ్రయం
                 ఎందుబోయినా
‍దుఖఃమే సుమా....       
ప్రభుని నమ్ముము
                    ఈ దినమే
తొలగిపోవును ఆ ప్రళయం
త్వరగ వస్తాడు యేసయ్యా
తరుణంనీకిక లేదయ్యా..