Song no:
సమర్ధవంతుడవైన నా యేసయ్యా సమస్తము నీకు సాధ్యమేనయ్యా (2)
నా స్తుతి యాగము నీకేనా ప్రాణార్పణ నీకేనా సర్వస్వము నీకేనా జీవన గానము నీకే ॥సమర్ధ॥
1.పచ్చిక పట్టులలో నన్ను పదిలముగాఉంచువాడవు నీవే యేసయ్యాఆత్మ జలములను నవ్యముగాఇచ్చువాడవు నీవే యేసయ్యా (2)
నే వెళ్ళు మార్గమునందు నా పాదము జారకుండా (2)
దూతల చేతులలోనన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా (2)
నీ ॥సమర్ధ॥
2.శత్రువు చరలోనుండి నను భద్రముగానిల్పువాడవు నీవే యేసయ్యారక్షణ వస్త్రమును నిత్యము నాపైకప్పువాడవు నీవే యేసయ్యా (2)
జీవించు దినములన్నియు నాలో పాపము ఉండకుండా (2)
రక్తపు బిందువుతోనన్ను కడుగువాడవు నీవే యేసయ్యా (2) నీ ॥సమర్ధ॥