రాజులరాజు పరమునువీడి పుడమిని దర్శించెను

రాజులరాజు పరమునువీడి పుడమిని దర్శించెను
పావనలోక దీవెనలన్నీ ధరణిపై వర్షించెను
అ.ప. : మనము కూడి కొనియాడి ఆరాధించుదాం
పాటపాడి యేసయ్యను పూజించుదాం
చీకటిఛాయలు దూరంచేసి వెలుగులు చూపించను
కోటి సూర్యులతేజం కలిగియున్న దైవం
ప్రేమరూపిగ ఉదయించెను
నాశనపాత్రుల శాపంబాపి విడుదల ప్రకటించను
లోక రక్షణకార్యం చేయబూనిన దైవం
గొర్రెపిల్లగ ప్రభవించెను
బాధిత జనులకు నాయంతిర్చి నవ్వులు పూయించను
కాడి తేలికచేసి బరువు దించే దైవం
మానవునిగా జనియించెను
ads
Blogger ఆధారితం.