జీవము నీవే ప్రాణము నీవే యేసయ్యా

    జీవము నీవే
    ప్రాణము నీవే యేసయ్యా
    జీవము నిచ్చిన
    పరమ తండ్రివి నీవయ్యా
    మరణము గెలిచి లేచిన యేసయ్యా
    మరణపు ముల్లును
    విరిచిన యేసయ్యా
    హల్లెలూయా ఆరాధన

    ఆదియు అంతము నీవే యేసయ్యా
    అన్నిటికి ఆధారము నీవే యేసయ్యా

    అన్నింటికి ముందున్నది
    నీవే యేసయ్యా
    అందరిలో ఉన్నావాడవు
    నీవే యేసయ్యా

    సత్యము మార్గము నీవే యేసయ్యా
    జీవము నా సర్వము
    నీవే యేసయ్యా

    నీతియు సమాధానము
    నీవే యేసయ్యా
    రక్షణ స్వస్థత నీలో యేసయ్యా