Song no:
చేరితి ప్రభువా నీ సన్నిధి
సాకి: సర్వ సృష్టి స్థితిలయ కారకా - శ్రీ (యెహోవా) ప్రభువైన దేవా
కన్య మరియ గర్భాన వెలసిన - శ్రీ యేసునాధా...
పిత సుతులకు అనుబంధమా - పవిత్రాత్మా నమస్తే.... నమస్తే...నమహః...
పల్లవి: చేరితి ప్రభువా నీ సన్నిధి
పూజలు చేయగా నా పెన్నిధి
పాడి స్తుతింతును నీ దివ్య నామం
వరములు చిందే ఈ దివ్యబలిలో
1. చీకటి ముసిరిన బ్రతుకులలో - వేదన నిండిన ఎడదలలో
వెలుగును నింపే జ్యోతివి నీవు - నీ కృప మాపై ప్రసరించు దేవా ||చేరితి||
2. శోధన బాధలు కలిగిన వేళ - నీ సిలువే మా కాశ్రయ దుర్గం
నూతన బలమును ఒసగుము దేవా
కనురెప్పల మము కాయుము ప్రభువా ||చేరితి||