Song no:
1. సర్వకృపానిధియగు ప్రభువా – సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము – సంతోషముగ నిను పొగడెదము
పల్లవి: హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయ యని పాడెదను – ఆనందముతో సాగెదను
2. ప్రేమించి నన్ను వెదకితివి – ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుటకై – పాపిని నను కరుణించితివి /హల్లెలూయ/
3. మరణ శరీరము మార్పు నొంది – మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి – మరణ భయములను తీర్చితివి /హల్లెలూయ/