Adhigo kalvari siluvalo yesayya vreladuchunnadu అదిగో కల్వరి సిలువలో యేసయ్య వ్రేలాడుచున్నాడు


Song no:

అదిగో కల్వరి సిలువలో
యేసయ్య వ్రేలాడుచున్నాడు  " 2 "  అదిగో

మన దోషము యేసుకు గాయములు
మన పాపము యేసుకు రక్తము     " 2 "
ఆ త్యాగమే  మన కోసమే              " 2 "
యేసయ్య సిలువలో వ్రేలాడెను " అదిగో "

మన నడకలు యేసుకు కాళ్లకు శీలలు
మన చేతలు యేసుకు చేతుల్లో మేకులు"2"
ఆ త్యాగమే  మన కోసమే              " 2 "
యేసయ్య సిలువలో వ్రేలాడెను " అదిగో "

మన తలంపులు యేసుకు ముళ్ళ కిరీటము
మన మాటలు యేసుకు బల్లెపు పోటు " 2 "
ఆ త్యాగమే  మన కోసమే              " 2 "
యేసయ్య సిలువలో వ్రేలాడెను " అదిగో "
أحدث أقدم